Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఈ దినమెంతో శుభ దినమునూతన జీవితం Telugu Christian Song Lyrics

ఈ దినమెంతో శుభ దినమునూతన జీవితం Lyrics

ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో||
నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)
యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో||
జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో||

Your favourites

  • No Favourites found!