Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ Telugu Christian Song Lyrics

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ Lyrics

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)
అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ||ఈ లోక||

1. జీవిత యాత్ర ఎంతో కఠినము (2)
ఘోరాంధకార తుఫానులున్నవి (2)
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)
కాయు వారెవరు రక్షించేదెవరు (2) ||ఈ లోక||

2. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)
అనుదినము నన్ను ఆదరించెదవు (2)
నీతో ఉన్నాను విడువలేదనెడు (2)
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) ||ఈ లోక||

3. తోడై యుండెదవు అంతము వరకు (2)
నీవు విడువవు అందరు విడచినను (2)
నూతన బలమును నాకొసగెదవు (2)
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) ||ఈ లోక||

Your favourites

  • No Favourites found!