ఈ పరిణయం కలకాలం నిలుచును
ఈ శుభదినం చిరునవ్వుల కలయిక (2)
ఆ దేవుడే ఏర్పరచిన జంటగా
సుఖసంతోషాలతో సాగించుము పయనము (2)
|| ఈ వేడుక కలకాలం ||
1. తోడునీడగా ఆ ప్రభువే అండగా
నూరేళ్ళ పంటగా దీవించును దేవుడే (2)
యేసయ్య దీవెనలే కురవాలి మీబ్రతుకులో
నిత్యము స్తుతియించుచు సాగాలి మీకాపురం (2)
సాగాలి మీ కాపురం || ఈ పరిణయం ||
2. మీ జీవితం ఆ ప్రభువుని నీడలో
ఆదర్శ దంపతులై నిలవాలి కలకాలము (2)
ప్రేమానురాగాలతో సాగాలి మీ కాపురం
అనురాగ బంధాలతో నిలవాలి మీజీవితం (2)
నిలవాలి మీజీవితం || ఈ పరిణయం ||
3. ఈ పరిణయం అనుబంధాల సందడై
ఈ శుభదినం మమకారాల మకరందమై (2)
సాగించు జీవితం యేసయ్య బాటలో
నడిపించు జీవనం మన యేసయ్య నావలో (2)
మన యేసయ్య నావలో || ఈ పరిణయం ||
