Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఈ పరిణయం కలకాలం నిలుచును ఈ శుభదినం చిరునవ్వుల Telugu Christian Song Lyrics

ఈ పరిణయం కలకాలం నిలుచును ఈ శుభదినం చిరునవ్వుల Lyrics

ఈ పరిణయం కలకాలం నిలుచును
ఈ శుభదినం చిరునవ్వుల కలయిక  (2)
ఆ దేవుడే ఏర్పరచిన జంటగా
సుఖసంతోషాలతో సాగించుము పయనము (2)
|| ఈ వేడుక కలకాలం || 

1. తోడునీడగా ఆ ప్రభువే అండగా
నూరేళ్ళ పంటగా దీవించును దేవుడే  (2)
యేసయ్య దీవెనలే కురవాలి మీబ్రతుకులో
నిత్యము స్తుతియించుచు సాగాలి మీకాపురం  (2)
సాగాలి మీ కాపురం || ఈ పరిణయం ||

2. మీ జీవితం ఆ ప్రభువుని నీడలో
ఆదర్శ దంపతులై నిలవాలి కలకాలము  (2)
ప్రేమానురాగాలతో సాగాలి మీ కాపురం
అనురాగ బంధాలతో నిలవాలి మీజీవితం (2)
నిలవాలి మీజీవితం  || ఈ పరిణయం ||

3. ఈ పరిణయం అనుబంధాల సందడై
ఈ శుభదినం మమకారాల మకరందమై  (2)
సాగించు జీవితం యేసయ్య బాటలో
నడిపించు జీవనం మన యేసయ్య నావలో  (2)
మన యేసయ్య నావలో  || ఈ పరిణయం ||

Your favourites

  • No Favourites found!