Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఈయనా యేసు రక్షకుడు తన దాయమని Telugu Christian Song Lyrics

ఈయనా యేసు రక్షకుడు తన దాయమని Lyrics

ఈయనా యేసు రక్షకుడు తన దాయమని రక్షింపఁ దలఁచెనా
నన్ను నీయనా యేసు రక్షకుఁడు ఆయాసమగు నొక్క మోపు నే
మోయలేకుండ నా మూపుపై నుండ శ్రేయఃకరపు సిలువఁజూపి నాకు
హాయి నిచ్చెను భార మంత వెడలించి ||యీయనా||

1. దురితాత్ముఁడని త్రోయకుండ నన్నుఁ బరిశుద్ధుఁడా యేసు ప్రభుఁడు
కరుణింప ధరణిలో నిది మహాద్భుతము నే మరుతునా యీ ప్రేమ
మరణమౌ దాఁక ||ఈయనా||

2. ఓపఁగూడని దుష్కృతంబుల్ నేను తేపతేపకుఁ జేసి ద్వేషినై యుండఁ
గోప మింతైన రానీక నన్నుఁ గాపురుషుఁ డని తాను ఖండింపఁ
డాయె ||నీయనా||

3. మనస్తమో గుణము లెడబాపెన్ నా దినకరోదయ మట్లు దీప్తిమది
మించెన్ తన పాదములఁ జాడ లబ్బెన్ సదా వినుతి కెక్కిన వాని
విమలాత్మ వెలుఁగు ||నీయనా||

4. హతుఁ డయ్యె నాయేసు నాకై దు ర్గతి తొలఁగి నాకు మో క్షమే
గల్గు కొఱకు అతి దయాదీర్ఘశాంతుండే దైవ సుతుఁ డని యెఱిగితి
శోధింపఁగాను ||ఈయనా||

5. దీవింపఁదగు నతని సిలువ నా జీవాంతమగు దనుక చెలఁగి
మోయుచును ఈ వసుంధర జనుల కెల్ల మీరు సేవించుఁ డేసునని
చెప్పి చాటుదును ||ఈయనా||

Your favourites

  • No Favourites found!