Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏగెదను నే చేరెదను Telugu Christian Song Lyrics

ఏగెదను నే చేరెదను Lyrics

ఏగెదను నే చేరెదను

సీయోనును నే చూచెదను (2)

విశ్వాస కర్తయైన నా యేసూ (2)

నీ సముఖములో నే మురిసెదను

నీ కౌగిలిలో ఉప్పొంగెదను (2)

జీవ కిరీటమును నే పొందెదను      ||ఏగెదను||

భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను

యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును (2)

దినదినము నాలో నే చనిపోవుచున్నాను

అనుదినము నీలో బ్రతుకుచున్నాను (2)

అనుదినము నీలో బ్రతుకుచున్నాను      ||ఏగెదను||

నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము

సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను (2)

మంచి పోరాటముతో నా పరుగును

కడముట్టించి జయమొందెదను (2)

విశ్వాసములో జయమొందెదను      ||ఏగెదను||

Your favourites

  • No Favourites found!