Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎగురుతున్నది విజయ పతాకం యేసు రక్తమే Telugu Christian Song Lyrics

ఎగురుతున్నది విజయ పతాకం యేసు రక్తమే Lyrics

ఎగురుతున్నది విజయ పతాకం - యేసు రక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును - సుఖ జీవనం చేయుటకు శక్తి నిచ్చును
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం


1. యేసుని నామం నుచ్చరింపగనే - సాతాను సైన్యము వణుకుచున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది - జయం పొందెడి నామము నమ్మినప్పుడే || రక్తమే ||


2. దెయ్యపు కార్యాలను గెలిచిన రక్తం - ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన - క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం || రక్తమే ||


3. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా - ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాద పద్మము పై చేరియున్న ప్రజలను - స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే || రక్తమే ||

Your favourites

  • No Favourites found!