ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం
1. ఒంటరి బ్రతుకులు విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు
పెళ్ళినాటినుండి తల్లితండ్రుల వదలి
భార్యభర్తలు హత్తుకొనుటేమిటో
2. గతకాలకీడంతా మరచెదరు
మేలులతో సంతసించెదరు
పెళ్ళినాటినుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో
3. ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధిపొందెదరు
పెళ్ళినాటినుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగిచక్కనైన జంటగా Lyrics
Your favourites
- No Favourites found!
