Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమనుఎలా విడువగలనయ్యా Telugu Christian Song Lyrics

ఎలా మరువగలనయ్యా నీ ప్రేమనుఎలా విడువగలనయ్యా Lyrics

ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా విడువగలనయ్యా నీ సేవను (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఎలా మరువగలనయ్యా||
ఆత్మీయులే నన్ను ఆదరించలేదు
ప్రేమించువారే ప్రేమించలేదు (2)
ఆదరించావు ప్రేమించావు (2)
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||
బంధువులే నన్ను ద్వేషించినారు
సొంత తల్లిదండ్రులే వెలివేసినారు (2)
చేరదీసావు సేదదీర్చావు (2)
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||
అనాథగా నేను తిరుగుచున్నప్పుడు
ఆకలితో నేను అలమటించినప్పుడు (2)
ఆదరించావు ఆకలి తీర్చావు (2)
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||

Your favourites

  • No Favourites found!