Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏల వర్ణించనయ్యా కల్వరి యాగంఆ సిలువ Telugu Christian Song Lyrics

ఏల వర్ణించనయ్యా కల్వరి యాగంఆ సిలువ Lyrics

ఏల వర్ణించనయ్యా కల్వరి యాగం
ఆ సిలువ ప్రయాణం (2)
ఏమని కొనియాడనయ్యా నీ రక్షణ త్యాగం
ఆ రక్త ప్రయాసం
ఏల వర్ణించనయ్యా కల్వరి యాగం
ఆ సిలువ ప్రయాణం
నీ రక్తమిచ్చి నను కొన్న ప్రయాణం
నీ ప్రాణమిచ్చి నాకు విలువిచ్చిన త్యాగం
ఏల వర్ణించనయ్యా…
వీరేమి చేయుచున్నారో ఎరుగరని క్షమించి (2)
నీ గొప్ప క్షమాగుణము నీవు నాకు నేర్పితివా (2) ||ఏల||
నీవు పరదైసులో ఉందువని దొంగతో (2)
నా స్తితి గమనించి నా పాపము క్షమియించినావా (2) ||ఏల||
నీ తల్లిని నీ శిష్యునకు అప్పగించినావా (2)
నా తల్లిని నా తండ్రిని గౌరవించుమన్నవా (2) ||ఏల||
నా దేవా నా దేవా నను విడనాడితివన్నావా (2)
నా పాప భారము మోసి నన్ను విడిపించినావా (2) ||ఏల||
నేను దప్పిగొన్నానని నీవు మొర్ర పెట్టినావా (2)
నా హృదయమే నీ దాహం నా రక్షణే నీ త్యాగమయా (2) ||ఏల||
నీవు సమాప్తమైనదని నీ ఆత్మను అప్పగించి (2)
నీ తండ్రి చిత్తమునే నీవు నెరవేర్చినావా (2) ||ఏల||
అప్పగించినావా నీ అత్మను నీ తండ్రికి (2)
నా ఆత్మను పరము చేర్చ మార్గమునే తెరచినావా (2) ||ఏల||

Your favourites

  • No Favourites found!