Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏలాటివాఁడో కాని యీ యేసుని నేమని Telugu Christian Song Lyrics

ఏలాటివాఁడో కాని యీ యేసుని నేమని Lyrics

ఏలాటివాఁడో కాని యీ యేసుని నేమని వివరింతుము గాలివాన
యేసుని గద్దింపునకుఁ చాల భయపడి నిలిచెను ||ఏలాటి||

1. ముద్దు శిష్యులతోడను సముద్రపు టద్దరికి వెళ్లెను కొద్ది పడవనెక్కెను
ఇంతలోనె పెద్దగాలి రేగెను ||ఏలాటి||

2. అల్లకల్లోలముగా సముద్రము అల్లలాడు నప్పుడు చల్లఁగ దోనె
వెనుక తలగడపైని మెల్లన నిదువోయెన్ ||ఏలాటి||

3. చింత లేదా యేమయ్యా బోధకుఁడా న శించిపోవుచున్నాము ఎంతో
వేదన పడితిమి కాపాడుమ టంచు శిష్యులు లేపిరి ||ఏలాటి||

4. దిగ్గునఁ బ్రభువు లేచి యా గాలిని గద్దించిన వెంటనే తగ్గి నిమ్మళించెను
సమస్తము సద్దు ఉడిగిపోయెను ||ఏలాటి||

5. ఏల భీతు లైతిరి యింతలోనే యెంత నమ్మిక లేదని యీలాగు
నోదార్చెను యేసు తన సొంత శిష్యుల నప్పుడు ||ఏలాటి||

Your favourites

  • No Favourites found!