Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండిప్రతి సమయములోను…ప్రతి పరిస్థితిలోను Telugu Christian Song Lyrics

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండిప్రతి సమయములోను…ప్రతి పరిస్థితిలోను Lyrics

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి
ప్రతి సమయములోను…
ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)
యెహోవా చేసిన మేలుల కొరకై
ఎల్లప్పుడును ఆనందించండి (2)
ఆరాధించండి ||ఎల్లప్పుడును||
పాపంబు తోడ చింతించుచుండ
నరునిగా ఈ భువిలో ఉదయించెగా
మన పాప భారం తన భుజమున మోసి
ప్రభువే తన ప్రాణం అర్పించెగా (2)
ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి
ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుక (2) ||ఎల్లప్పుడును||
విశ్వాసమునకు కలిగే పరీక్ష
ఓర్పును కలిగించే ఒక సాధనమై
శోధనకు నిలిచి సహించిన వేళ
జీవ కిరీటమును పొందెదము (2)
నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి
సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి (2) ||ఎల్లప్పుడును||
ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి
మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి
మనతో నివాసమును కలిగి యుండుటకు
త్వరలోనే రారాజుగా రానైయుండె (2)
శుభప్రదమైన నిరీక్షణతో కనిపెట్టండి
సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి (2) ||ఎల్లప్పుడును||

Your favourites

  • No Favourites found!