Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని Telugu Christian Song Lyrics

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని Lyrics

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2)
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2)
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా (2)
రక్షించానా నీకై వెలిగించానా

1. ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా (2)
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2)
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2)

2. ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా (2)

3. ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా (2)

Your favourites

  • No Favourites found!