Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు Telugu Christian Song Lyrics

ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు Lyrics

ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి
సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు
నీకు ||నేమి||

1. నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ
దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము
||నేమి||

2. అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను
వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు
||ఏమి||

3. నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ
జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి
నాలించు ||మేమి||

4. నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును
నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ
క్షమాపణ కొరకు ||నేమి||

5. నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని
మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు
||డేమి||

Your favourites

  • No Favourites found!