Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల Telugu Christian Song Lyrics

ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల Lyrics

ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల మోయ నాయెను నా
యేసు ఎంత ఘోరము లాయెను ఈ మానవులు యెరుషలేము బైటకు
దీయ నేమి నేరము దోచెను ||ఏమి||

1. మున్ను దీర్ఘదర్శు లెన్నిన రీతిని కన్నెకడుపున బుట్టిన నా యేసు
వన్నె మీరంగ బెరిగిన చెన్నైన నీ మేను చెమట బుట్టంగ నీ కిన్ని
కడగండ్లాయెను ||ఏమి||

2. కన్నతల్లి యిట్టి కడగండ్లు గాంచిన కడుపేరీతినోర్చును నా యేసు
గాంచనేలను గూలును నిన్నెరిగి నట్టివారు నీ పాట్లు గని యేడ్చు
చున్నారలీ వేళను ||ఏమి||

3. అయ్యయ్యో యూదు లింత నెయ్యంబు దప్పిదైన భయంబు విడిచి
పూని నా యేసు మోయ శక్యంబు గాని కొయ్యమూపు నెత్తి రయ్య నీ
కెంత భార మయ్య వెతజూడ జాలను ||ఏమి||

4. పిల్ల లాట్లాడినట్లు ముల్లులతో కిరీట మల్లి నెత్తిన గొట్టిరి నా యేసు
పల్లరుపు లధికమాడిరి ఎల్లవారిలో నిన్ను ఎగతాళి గావించి మొగము
మీ దెల్లనుమిసిరి ||ఏమి||

5. కొరడాలతో నిన్ను గొట్టి కండ్లకు గంత గట్టి చేజరిచి వేడ్కను నా
యేసు అట్టి వారెవ్వరంచును విరగ భావంబునడిగి నెక్కిరించుచు నీ
వెంబడి వత్తురేలను ||ఏమి||

6. ఏలడివారు నడువ మ్రోలవస్త్రంబులను నేల బరిచిన రీతిగా నా
యేసు మ్రోలబరిచిరియట్లుగ ఏల యీ కోడిగంబు లేల నీమీద కంటు
ఏమి నేరంబు లేదుగ ||ఏమి||

7. చాల బాధించి క పాల స్థలమునకు వచ్చి నేల బాతిరి కొయ్యను నా
యేసు జాలి రవ్వంత లేకను కాలు సేతులినుప చీలలతో బిగించ జిమ్మి
రక్తంబు గారెను ||ఏమి||

8. నాదేవ నా దేవ నన్నెందుకై విడిచి నా వంచు మొరబెడితివి నా
యేసు నమ్మితివి లోబడితివి వేదనధికంబాయె నే దిక్కులేనట్టు
యూదాళి కగుపడితివి ||ఏమి||

9. అంధకారము దేశ మంతట గలిగెను ఆవరించెను సూర్యుని నా
యేసు ఆలయపు తెరచినిగెను బంధ స్తంభమునుండి బహు గొప్ప
శబ్దముతో బిలిచెద వేమిట్లను ||ఏమి||

10. ఓ తండ్రి నీ చేతి కొప్పగించుచున్నాను ఒనరంగ నా యాత్మను నా
యేసు అని ప్రాణమును వీడెను ఏ తప్పిదంబు లేక నీ పాటునొందితివి
ఎంతో వింతై నిలుచును ||ఏమి||

11. నీ చాత్ము డొకడు నిఱ్ఱ నీల్గి బల్లెంబుతోడ నీ ప్రక్క బొడిచె చావను నా
యేసు నీరు నెత్తురు గారెను ఏచియున్నట్టి కస్తి కెట్లు నీ యొడలుసైచె
నెంతో చోద్యంబు చూడను ||ఏమి||

12. పాపాత్ములకు పూట బడిన వల్లనే యింత పరితాపమరణమాయెను
నా యేసు ఎరిగే యనుభవించెను నా పాప ఫలము నిన్ను వేపాట్లు బెట్టి
చంప నోపితివయ్య ప్రేమను ||ఏమి||

13. ఎంత యమూల్యమైన దెంతయనంతమైన దెంతయగాధమైనది నా
యేసు ఎంతో యుచితమైనది ఎంతో వింతైన ప్రేమ ఏహ్యులమైన
మాకు ఏల కనుపర్చబడ్డది ||ఏమి||

14. ప్రేమాతిశయుడనేను ఏ మాత్రుడను నెన్న నా మానసమున కందను
నా యేసు ప్రేమ సారంబు తెలియను పామరాళిని బ్రోచు క్షేమాధికారి
నిన్ను యేమంచు వర్ణింతును ||ఏమి||

Your favourites

  • No Favourites found!