Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏమి తెచ్చి నిను దర్శింతునయాఏ రీతిగా Telugu Christian Song Lyrics

ఏమి తెచ్చి నిను దర్శింతునయాఏ రీతిగా Lyrics

ఏమి తెచ్చి నిను దర్శింతునయా
ఏ రీతిగా నిను పూజింతునయా
వినయముగా నీ సన్నిధి మ్రొక్కి
స్తుతియాగము చేతునయా
1.వెండి బంగారములు నీవే గదా
కొండపైని పశువులు నీ వశమే గదా
విరిగిన మనస్సు నలిగిన హృదయం
నీవు కోరిన దూపమాయ ||ఏమి||
2.ప్రథమ ఫలములు నీ సేవకీయనా
దహన బలుల నైవేద్యమీయనా
సజీవయాగముగా దేహమర్పించుట
నీదు దృష్టికి యుక్తమయా ||ఏమి||
3.మంచి తైలముతో అభిషేకించనా
ఎంచి కానుకలిచ్చి భజయించనా
న్యాయముగా నడచుట కనికరము చూపుట
నీకిష్టమైన యాగమయా ||ఏమి||

Your favourites

  • No Favourites found!