ఏమివ్వ గలనయ్య నీ ప్రేమకు
నీ రుణము నే తీర్చగలనా (2)
అత్యున్నత సింహాసనము పై
ఆసినుడవైన నా దేవా
అత్యంత ప్రేమ స్వరూపి
ఆరాధింతును నీనే (2)
ఆరాధింతును నీనే
ఏమివ్వ గలనయ్య నీ ప్రేమకు
నీ రుణము నే తీర్చగలనా || ఏమివ్వ ||
1. నా తల్లీ కన్నా నా తండ్రి కన్నా
నా అన్న కన్నా నా చెల్లి కన్నా (2)
ప్రేమించే దేవుడవు నీవు
ప్రేమను చూపి క్షమించే దేవుడవు (2)
ప్రేమను చూపి క్షమించే దేవుడవు
ఏమివ్వ గలనయ్య నీ ప్రేమకు
నీ రుణము నే తీర్చగలనా
2. నీ రక్తమిర్చి విమోచించి నావే
నా పాపభారం క్షమించి నావే (2)
నీలాంటి దేవుడు లేడయ్య
నన్ను నన్నుగా ప్రేమించవయ్యా (2)
నన్ను నన్నుగా ప్రేమించవయ్య
ఏమివ్వ గలనయ్య నీ ప్రేమకు
నీ రుణము నే తీర్చగలనా
