ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై (2)
నిన్ను గూర్చి లోకమంత చాటనా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య||
గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి||
ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు (2) ||నిన్ను గూర్చి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఏమివ్వగలనయ్య నా యేసయ్యా నీవు చేసిన Lyrics
Your favourites
- No Favourites found!
