Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏమివ్వగలనయ్య నా యేసయ్యా Telugu Christian Song Lyrics

ఏమివ్వగలనయ్య నా యేసయ్యా Lyrics


ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై (2)
నిన్ను గూర్చి లోకమంత చాటనా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2)         ||ఏమివ్వగలనయ్య||

గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణించలేను నా యేసయ్యా (2)         ||నిన్ను గూర్చి||

ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు (2)         ||నిన్ను గూర్చి||

Your favourites

  • No Favourites found!