ఎన్నడు నెడఁబాయ నే కొల(ది విడనాఁడ ననిన తండ్రి నిరత
మన్ని బాధలయందు నన్ని దుఃఖములందు నన్ను ఁ బ్రోచు ||ఎన్నడు||
1. పాపుల రక్షింపఁ బ్రాణమిచ్చిన యేసు బ్రతికి యుండు తన
ప్రాపు గోరినవారి భారము తా మోసి ప్రాపయి యుండు ||ఎన్నడు||
2. ఎల్ల కాలంబుల నేకరీతిగ నుండు యేసునాధుఁ డాతఁ డెల్ల
విశ్వాసుల నెల్ల వేళలఁ దలఁచి యేలుచుండు ||ఎన్నడు||
3. తనవారి యక్కఱలు తానెఱిగి యున్నాఁడు తప్పకుండ నాతఁ డెనలేని
దయఁబూని వినువారి మనవులు వేడ్కమీఱ ||ఎన్నడు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎన్నడు నెడఁబాయ నే కొల(ది విడనాఁడ Lyrics
Your favourites
- No Favourites found!
