Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా యేసయ్యను Telugu Christian Song Lyrics

ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా యేసయ్యను Lyrics


ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా
యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలో ఎన్నెలా
ఆ సామిని కొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా

1. పరలోకం నుండి దొరా నరలోకం వచ్చిండు
మన సీకటి బతుకుల్లో ఎలుతురే తెచ్చిండు

2. సెంతజేరినోళ్ళకంత సింతలన్ని బాపెనంట
ఎంతటి రోగాలైనా సిటికెలో తీసేసెనంట

3. సొరగానికి దారిసూప అడుగుబెట్టె భూమిమీద
మరణానికి బుద్దిసెప్ప కన్నుమూసె సిలువమీద

4. సక్కనయ్య మోముజూడ సిక్కులన్ని తీరిపోవు
మక్కువతో శరణువేడ బతుకంతా మనలగాయు

Your favourites

  • No Favourites found!