ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు
నిను రక్షించుట కొరకే
మన పాపం కడుగుట కొరకే (2)
వెలలేనిదీ.. తన త్యాగం..కనలేనిదీ.. ఆ మరణం (2)
విలువైన నీ కోసమే – బలియాయెను మన కోసమే (2)
క్రీస్తేసుని ఈ త్యాగము
మనకోసమే బలియాగము
నీ రక్షణె తన ద్యేయము
నువు నమ్మినచో నిత్యజీవము || ఎన్నెన్నో ||
1. ఎంతెంత అవమానము –
సహియించెను తన మౌనం (2)
అన్యాయమే గెలిచిందిగా –
మన శిక్షకు తను తలవంచెగా (2)
మెలిపెట్టిన కొరడాలు చీల్చేసేను అణువణువు
ఒలికించే తన రక్తమె మనపాప పరిహారమే
అది మనపాప పరిహారమే…
క్రీస్తేసుని ఈ త్యాగము
మనకోసమే బలియాగము
నీ రక్షణె తన ద్యేయము
నువు నమ్మినచో నిత్యజీవము || ఎన్నెన్నో ||
2. శిరమంత ముండ్లేగా
పలుమార్లు దిగబడగ (2)
మోశాడు శిలువ భారమే (అది)
మనఘోర పాపభారమే (2)
బంధిచెను ఆ శీలలు వ్రేలాడెను తన తనువు
విడిచేసే తన శ్వాసనే విమోచించె మన ప్రాణమె
విమోచించె మన ప్రాణమె…
క్రీస్తేసుని ఈ త్యాగము
మనకోసమే బలియాగము
నీ రక్షణె తన ద్యేయము
నువు నమ్మినచో నిత్యజీవము
ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు
నిను రక్షించుట కొరకే
మన పాపం కడుగుట కొరకే (2)
వెలలేనిదీ.. తన త్యాగం..
కనలేనిదీ.. ఆ మరణం (2)
విలువైన నీ కోసమే –
బలియాయెను మన కోసమే (2)
ప్రియ సహోదరి సహోదరులారా !
ఎన్నో మరణ వేదనలు పొంది మన పాపవిమోచనకై తన ప్రాణమిచ్చిన క్రీస్తేసుని త్యాగానికి మనమేమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆయన రక్తంలో మనల్ని మనం పవిత్ర పరచుకోవడం తప్ప
