Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా Telugu Christian Song Lyrics

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా Lyrics

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)
నీ జనన మెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2)
ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత||
2.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2)
దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత||
3.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2)
పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2) ||ఎంత||

Your favourites

  • No Favourites found!