Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంతదూరము మోయించెదరు స్వామికింత సిలువనెత్తి నుంతైన Telugu Christian Song Lyrics

ఎంతదూరము మోయించెదరు స్వామికింత సిలువనెత్తి నుంతైన Lyrics

ఎంతదూరము మోయించెదరు స్వామి
కింత సిలువనెత్తి నుంతైన దయలేక ||ఎంత||

1. ఒంటిగా ప్రార్థించి యుపవాసములు జేసి
కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని ||ఎంత||

2. సొమ్మునాశించి గురున్ అమ్ముకొన్న యూద
నమ్మించి మీకిచ్చె నిమ్మానుయేలును ||ఎంత||

3. కరములు జోడించి కడకు గేత్సెమనిలో
పరమ తండ్రిని వేడు నిరపరాదిని పట్టి ||ఎంత||

4. పిరికి పిలాతుని బెదరించి యదలించి
యెరుషాలేం వీధుల నేసుని ద్రిప్పుచు ||ఎంత||

5. ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా
ఘడియ ఘడియకు తిట్టి గట్టిగ కొట్టుచు ||ఎంత||

6. కలువరి గిరివరకు సిలువ మోయలేక
అలసిన ప్రభుజంప నాలస్యమును చేసి ||ఎంత||

7. యేసు నీకొరకై నే నేడ్చుటకంటెను
దోషినని గ్రహించి దోసిలొగ్గుటె మేలు ||ఎంత||

Your favourites

  • No Favourites found!