Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంతగ నిను కీర్తించినను  ఏమేమి Telugu Christian Song Lyrics

ఎంతగ నిను కీర్తించినను ఏమేమి Lyrics

ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా (2)
ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా
దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2)
ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా||
కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి
నా గుడారమునే విశాల పరచి (2)
ఇంతగ నను హెచ్చించుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను దీవించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||
నీ నోటి మాట నా ఊటగ నుంచి
నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2)
ఇంతగ నను వాడుకొనుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను హెచ్చించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||

Your favourites

  • No Favourites found!