ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ మంతయును సమాప్త మాయెను
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకుఁ కల్వరి మెట్టను సంతసముతో
సిల్వఁ గొట్టఁగ నూర్యుఁ డంధకారమాయెను ||ఎంత||
1. గలిబిలి గలిగె నొకప్పుడు శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు
పలుకు భాషయు నొక్క టైనను పలువిధములగు భాషలాయెను
నలుదెసలకును జనులు పోయిరి కలువరి పై కలిసికొనిరి ||ఎంత||
2. పావనుండగు ప్రభువు మనకొరకై యా సిలువమీఁద చావునొందెడు
సమయమందున దేవుఁడా నా దేవుఁడా నన్నేల చెయివిడిచితివి యనియా
రావముగ మొఱబెట్టెను యె హోవయను దన తండ్రితోను ||ఎంత||
3. అందు దిమిరము క్రమ్ము గడియయ్యొ నా నీతి సూర్యుని నంత చుట్టెను
బంధకంబులు నిందవాయువు లెన్నో వీచెను కందు యేసుని యావరించెను
పందెముగ నొక కాటువేసెను పాత సర్పము ప్రభువు యేసును ||ఎంత||
4. శాంతమాయె నటంచుఁ బలుకుచును ఆ రక్షకుఁడు తన స్వంత విలువగు
బ్రాణమును వీడెన్ ఇంతలో నొక భటుఁడు తనదగు నీటెతోఁ ప్రభు
ప్రక్కఁ బొడువఁగ చెంతఁజేరెడి పాపులను ర క్షించు రక్తపు ధారఁ గారెను
||ఎంత||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో Lyrics
Your favourites
- No Favourites found!
