Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత|| Telugu Christian Song Lyrics

ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత|| Lyrics

ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత||

1. హానికరుడ హింసకుడను దేవ దూషకుడను నేను
అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ||ఎంత||

2. రక్షకుండా నాకు బదులు శిక్ష ననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి చావొందితి నాకై ||ఎంత||

3. ఏమి నీ కర్పింపగలను ఏమిలేని వాడనయ్య
రక్షణంపు పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా ||ఎంత||

4. నీదు నామమునకు యిలలో భయపడెడి వారి కొరకై
నాధుడా నీవిచ్చు మేలు ఎంతగొప్ప దేసువా ||ఎంత||

5. నేను బ్రతుకు దినములన్ని క్షేమ మెల్లవేళలందు
నిశ్చయముగ నీవు నాకు ఇచ్చువాడా ప్రభూ ||ఎంత||

6. నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీర్చువాడ నీవు
నాదు కాపరివి నీవు నాకు లేమి లేదుగా ||ఎంత||

7. అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా
హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడెదా ||ఎంత||

Your favourites

  • No Favourites found!