Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంత ప్రేమో నాపై యేసయ్యానేను ఎలాగ Telugu Christian Song Lyrics

ఎంత ప్రేమో నాపై యేసయ్యానేను ఎలాగ Lyrics

ఎంత ప్రేమో నాపై యేసయ్యా
నేను ఎలాగ వివరించగలనయ్యా (2)
పెంట కుప్పలలో పడి ఉన్ననూ
నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా
జిగట ఊబిలో నేను దిగి ఉన్ననూ
నా చేయి పట్టి నను పైకి లేపితివా ||ఎంత||
దాహం తీర్చగలేని బావి అయిననూ
నేను పాపపు కుండను విడువకుంటిని (2)
నా పాపమంత క్షమించితివి (2)
జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి (2) ||ఎంత||
పందులున్న చోట నలిగి పడి ఉంటిని
నా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది (2)
బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా (2)
క్షమియించి నీ రక్షణిచ్చితివి (2) ||ఎంత||
నరికిన కొమ్మ వలె ఎండిపోతిని
నా పాపాన్ని దాచి దాచి నశించితిని (2)
ఒప్పుకొనగా నాకు జీవమిచ్చితివి (2)
(ఎండిన) మొద్దును చిగురింపజేసితివి (2) ||ఎంత||

Your favourites

  • No Favourites found!