ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర కెంతో దుఃఖము పొంది తివా
యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు
ఆ పొంతి పిలాతు యూ దులు నీకుఁ బెట్టిన శ్రమలను దలపోయఁ
గా ||నెంతో||
1. వచ్చిరి యూదులు ముచ్చట లాడుచు నెచ్చట వాఁడనుచు నిన్ను
మచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా ||యెంతో||
2. సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంధులు గట్టినవా నీవు
పొందిన బాధ నా డెందము తలఁపనా నందములే దాయెను ||ఎంతో||
3. కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని న్నట్టిట్టు నెట్టుచును వారు
పెట్టుశ్రమలు తుద మట్టున కోర్చియుఁ బెట్టితివా ప్రాణము ||నెంతో||
4. నెపముఁ బెట్టుచుఁ దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టి
నారా నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకుఁ
జూపినావా ||యెంతో||
5. చక్కని నా యేసు మిక్కిలి బాధ నీ కెక్కువ గలిగె నయ్యా ఆహా
యొక్క దుష్టుఁడీటె ప్రక్కను గ్రుచ్చి తన యక్కస దీర్చుకొనెనా ||యెంతో||
6. అన్నదమ్ములైన అక్క సెల్లెం డ్రైనఁ కన్న పిత్రాదు లైన నన్ను ఎన్నఁ
డైన బ్రేమించలే రైరి నా యన్నా ప్రేమించినావా ||యెంతో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర కెంతో Lyrics
Your favourites
- No Favourites found!
