ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే
నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ
1. మన ప్రభువే రక్షణ శృంగమాయె - శత్రువు నోడించ శక్తి మంతుడు
మనకు జయము నిచ్చును
2. ప్రభువే మన రక్షణ శైలమాయె - దృఢపరచె నాయనే మనల
పాదముల స్థిరపరచెను
3. ప్రభువే మన రక్షణ దుర్గమాయె - తనయందే మనకు పూర్ణ భద్రత
ప్రియమార దయచేయును
4. ప్రభువే మన రక్షణ కేడెమాయె - దుష్టుని బారినుండి తప్పించి
పదిలముగా రక్షించును
5. ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము - జీవము ద్వారా రక్షణ కనుపరచ
ఆశతోడ నుందుము
6. రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది - రక్షణ వూటచే సంతృప్తి కలిగె
పరిపూర్ణత నీవేగా
7. రక్షణ వస్త్రము ధరింప జేసెనుగా - నీతి వస్త్రములను ధరింపజేసి
ఆనందింప జేసెను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ Lyrics
Your favourites
- No Favourites found!
