Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ Telugu Christian Song Lyrics

ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ Lyrics


ఎంతో సుందరుడమ్మ తాను…
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
దవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
దవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – (2)
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
అవలీలగా నతని గురిథింపగలనమ్మా (2) ||ఎంతో||
పురులు నొప్పులు కల్గి స్ఫుర దూపి అగు విభుడు (2)
మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
పురులు నొప్పులు కల్గి స్ఫుర దూపి అగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు – (2)
సిరులు కురిపించెను వర దేవ తనయుండు (2)
విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
పాలతో కడిగిన నయనాలు కలవాడు (2)
విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
పాలతో కడిగిన నయనాలు కలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు – (2)
కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
విలువైన చూపొసఁగె వరమీని తనయుండు (2) ||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – (2)
ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||

Your favourites

  • No Favourites found!