Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంతో సుందరుడమ్మ తాను… Telugu Christian Song Lyrics

ఎంతో సుందరుడమ్మ తాను… Lyrics


ఎంతో సుందరుడమ్మ తాను…

ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను (2)         ||ఎంతో||

ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – (2)
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
అవలీలగా నతని గురితింపగలనమ్మా (2)         ||ఎంతో||

కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు – (2)
సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
విరబూయు పరలోక షారోను విరజాజి (2)         ||ఎంతో||

పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
పాలతో కడిగిన నయనాలు గలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు – (2)
కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2)         ||ఎంతో||

మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
చలువ రాతిని బోలు బలమైన పాదాలు – (2)
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2)         ||ఎంతో||

అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – (2)
ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2)         ||ఎంతో||

Your favourites

  • No Favourites found!