Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంతో వింత యెంతో చింత యేసునాధు Telugu Christian Song Lyrics

ఎంతో వింత యెంతో చింత యేసునాధు Lyrics

ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత పంతము తోఁ
జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత ||ఎంతో||

1. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా అట్టి శ్రమల నొంది
పలుకఁ డాయె యేసు స్వామి నాఁడు ||ఎంతో||

2. మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపుపైని మొయ్యలేక మ్రానితోడ
మూర్ఛఁబోయె నేసు తండ్రి ||యెంతో||

3. కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలుసేతులలోఁ జీలల్ కఠిను లంత గూడి
కొట్టిరి ఘోరముగఁ క్రీస్తేసున్ బట్టి ||యెంతో||

4. దాహముగొనఁ జేదు చిరకఁ ద్రావ నిడిరి ద్రోహు లకటా ధాత్రిఁ ప్రజల
బాధ కోర్చి ధన్యుఁడా దివి కేగె నహహా ||యెంతో||

5. బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్ పారె నీరు రక్త మహహా ఏరై పారె యేసు
రక్త మెల్ల ప్రజల కెలమి నొసఁగు ||నెంతో||

Your favourites

  • No Favourites found!