Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏపాటి దాననయా Telugu Christian Song Lyrics

ఏపాటి దాననయా Lyrics

ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2)
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2)
ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది       ||ఏపాటి||

కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు (2)
అందరు నను విడచినా నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా       ||ప్రేమించే||

నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా (2)
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా       ||ప్రేమించే||

Your favourites

  • No Favourites found!