Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎప్పుడో ఎక్కడో జన్మించిన మీరిరువురు దేవుని Telugu Christian Song Lyrics

ఎప్పుడో ఎక్కడో జన్మించిన మీరిరువురు దేవుని Lyrics

ఎప్పుడో ఎక్కడో జన్మించిన మీరిరువురు
దేవుని ప్రేమలో జతపరచబడే వేళలో (2)
సంతోషం ఎదలో పొంగింది – మీ ఇరువురిలో
ఆనందం మదిలో నిండింది – మా అందరిలో
ఆశీర్వాదములే కురిసినవి – ఈ వేడుకలో
కలకాలం జతగా ఉండుటకే – ఈ లోకంలో
విష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మ్యారీడ్ లైఫ్
వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్ (2) ||ఎప్పుడో||
ఒంటరిగా నుండుట మంచిది కాదని
నరునికి సహకారిగా స్త్రీని నిర్మించెను (2)
సంఘమునకు క్రీస్తేసే శిరస్సైనట్టుగా
భార్యకు శిరస్సుగా భర్తను నియమించెగా (2)
ఈ సత్యం తెలుసుకుంటే మీ జీవితమంతా సౌభాగ్యం
దేవునిపై కట్టుకుంటే మీ కుటుంబమంతా బహు ధన్యం (2)
విష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మార్రీడ్ లైఫ్
వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్ (2) ||ఎప్పుడో||
ఎముకలలో ఎముకగా దేహములో సగముగా
ఇరువురు ఒక్కటయ్యే ఈ నాటి నుండి (2)
క్రీస్తేసు సంఘమును ప్రేమించినంతగా
భార్యను భర్తయూ ప్రేమించవలెనుగా (2)
ఈ సత్యం తెలుసుకుంటే మీ జీవితమంతా సౌభాగ్యం
దేవునిపై కట్టుకుంటే మీ కుటుంబమంతా బహు ధన్యం (2)
విష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మార్రీడ్ లైఫ్
వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్ (2) ||ఎప్పుడో||

Your favourites

  • No Favourites found!