Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎరిగియుంటివే యెహోవాయేసుక్రీస్తునందు నన్ను ఎరిగిభూమి పునాదులు Telugu Christian Song Lyrics

ఎరిగియుంటివే యెహోవాయేసుక్రీస్తునందు నన్ను ఎరిగిభూమి పునాదులు Lyrics

1. ఎరిగియుంటివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - ఎరిగి
భూమి పునాదులు వేయకముందే
ఆకాశము సహా లేకున్నపుడే
ఇలపర్వతములు నిలవకముందే
కనబడు ప్రతిదియు లేకున్నపుడే - ఎరిగి
2. నిర్ణయించితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - నిర్ణ
పరమున కూటము జరుగకముందే
రక్షణ వెలుగుకు రాకున్నపుడే
ప్రాయశ్చిత్తపు బలికాకున్నపుడే
యేసు రూపమిల్ నేర్పడనపుడే - నిర్ణ
3. పేరున పిల్చితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - పేరున
చేత ఆదామును చేయకముందే
హానోకు నీతో నడువకముందే
నోవాహును రక్షింపకముందే
పిత్రుడబ్రామును పిలువకముందే - పేరున
4. నీతిగ తీర్చితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - నీతిగ
గర్భములో నే కలుగకముందే
కాలపరిమితి కాకున్నపుడే
కటిక చీకటి కాకున్నపుడే
నిర్దేవుడనై నేనుండగనే - నీతిగ
5. మహిమ పరచితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - మహిమ
తేజోమయముగ దివిరాజ్యమున
దూత గణంబులు ప్రీతిగ పొగడ
తరుగని నిత్యతండ్రి మహిమతో
మహిమ రూపుడగు మరియ సుతునితో - మహిమ


Your favourites

  • No Favourites found!