Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక Telugu Christian Song Lyrics

ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక Lyrics

ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక నీ దిక్కెవ్వరు చెపుమా
దురితం బిది స చ్ఛరితం బిది యని యెరుక సరకు గొన కేమియు నీ
||యెఱిఁగి||

1. ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు
ఎదలో ననుభవ మెఱింగి మరల దు ర్మదమున దుష్కృత పదమున
బడితివి ||యెఱిఁగి||

2. సకలముఁ జూచెడు దేవుని కంటికిఁ జాటుగ జరిగెడి పని యేది ఇఁక
జెవి గుసగుస లెల్లను దిక్కులఁ బ్రకటముఁ జేసెడు ప్రభు వున్నాఁడని
||యెఱిఁగి||

3. ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ ప్రభు యేసుని వెతబడఁ జేసెదవు
తిన్నని మార్గము తెలిసియుండి నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో
||యెఱిఁగి||

4. గద్దించెడు మనస్సాక్షికి గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై
వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు పరు గెత్తితి వయ్యో ||యెఱిఁగి||

5. పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడై నీ దిక్కునుకో తాళుచు
బశ్చాత్తాపముపడి యిక జాలించుము కలు షపు యత్నంబు ||యెఱిఁగి||

6. అపరిమిత దయా శాంతులు గల ప్రభు వనిశము కోపింపఁడు నీపై
కృపా వాగ్దద్తము లెపుడు దలఁచి నీ యపవిత్రతఁ గని హా యని
యేడ్వుము ||యెఱిఁగి||

Your favourites

  • No Favourites found!