Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎవని అతిక్రమములు మన్నింపబడెనోపాపపరిహార మెవడొందెనో వాడే Telugu Christian Song Lyrics

ఎవని అతిక్రమములు మన్నింపబడెనోపాపపరిహార మెవడొందెనో వాడే Lyrics

ఎవని అతిక్రమములు మన్నింపబడెనో
పాపపరిహార మెవడొందెనో వాడే ధన్యుండు

1. యెహో వాచే నిర్దోషిగా తీర్చబడియు
ఆత్మలో కపటము లేనివాడే ధన్యుండు ||ఎవని||

2. మౌనియై యుండి దినమెల్ల నే జేసినట్టి
ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను ||ఎవని||

3. దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండ
నా సారము వేసవిలో ఎండినట్లాయె ||ఎవని||

4. నేను నా దోషమును కప్పుకొనక
నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని ||ఎవని||

5. నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా
నీవు నా దోషమును మన్నించితివిగా ||ఎవని||

6. కావున నీ దర్శనకాలమందు
భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు ||ఎవని||

7. విస్తార జలప్రవాహము పొర్లినను
నిశ్చయముగ అవి వారి మీదికి రావు ||ఎవని||

8. నాకు దాగుచోటు నీవే శ్రమలోనుండి
నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా ||ఎవని||

9. విమోచన గానములతో నీవు నన్ను
ఆదరించి నాకుపదేశము చేసెదవు ||ఎవని||

Your favourites

  • No Favourites found!