Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి Telugu Christian Song Lyrics

ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి Lyrics

ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||
ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||
ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||
మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||

Your favourites

  • No Favourites found!