ఎవరికీ ఎవరు ఈలోకములో
ఎంతవరకు మనకీబంధము (2)
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికీ ఎవరు శాశ్వతము (2)
మన జీవితం ఒక యాత్ర
మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్నీ గెలవడమే ఒక తపన (2)
1. తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నంతవరకే
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంతవరకే (2)
“స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ”
నీ ధనమున్నంతవరకే (2) || మన జీవితం ||
2. ఈ లోకశ్రమలు ఈ దేహమున్నంతవరకే
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంతవరకే (2)
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ (2)
కాదెన్నడు నీకు వ్యర్థం (2) || మన జీవితం ||
