Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల Telugu Christian Song Lyrics

ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల Lyrics

ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు
బోధ చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||

1. కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ
బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న ||నెవరు||

2. దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము
వారి దౌనటంచు ప్రభువు తెల్పె ||నెవరు||

3. వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పుఁ
బొంది నిత్య సంతోషింతు లని తెల్పె ||నెవరు||

4. శాంతి నీతికరుణల యందా సక్తిగల వారు భూస్వతంత్రులై పరి తృప్తినొంది
దయఁ బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు||

5. పరిశుద్ధ హృదయులు పరా త్పరునఁ జూతురు సర్వ నరుల
సమాధానపరచు నరులె పరమ జనకుని సుతులు ||నెవరు||

6. నీతికొర కాపద నొందెడి నిశ్చ లాత్ములు వారు ఖ్యాతిగఁ బర లోక
రాజ్య ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు ||ఎవరు||

Your favourites

  • No Favourites found!