Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎవరు ఉన్నా లేకున్నా Telugu Christian Song Lyrics

ఎవరు ఉన్నా లేకున్నా Lyrics

ఎవరు ఉన్నా లేకున్నా
యేసయ్య ఉంటే నాకు చాలు (2)
అందరి ప్రేమ అంతంత వరకే
యేసయ్య ప్రేమ అంతము వరకు (2)         ||ఎవరు||

కునుకడు నిదురపోడు
కాపాడుతాడు నన్నెప్పుడు (2)
ఆపదొచ్చినా అపాయమొచ్చినా (2)
రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు (2)       ||అందరి||

తల్లి మరచినా తండ్రి విడచినా
నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు (2)
ముదిమి వచ్చినా తల నెరిసినా (2)
చంక పెట్టుకొని నన్ను మోస్తాడు (2)       ||అందరి||

అలసిన కృషించినా
తృప్తి పరచును నన్నెల్లప్పుడు (2)
శత్రువొచ్చినా శోధనలు చుట్టినా (2)
రెక్కలు చాపి నన్ను కాపాడును (2)       ||అందరి||

Your favourites

  • No Favourites found!