Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలోఎవరుఉంటారు Telugu Christian Song Lyrics

ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలోఎవరుఉంటారు Lyrics

ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరుఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా ||2||
అ:ప: యేసయ్యా... నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా.... నిన్ను చేరాలని ఆశ
1.అందరు ఉన్నారని అందరు నావారని
తలచితిని భ్రమచితిని - చివరికి ఒంటరినైతిని
చివరికి ఒంటరినైతిని
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా
2.అంధకారములో అంధుడనేనైతిని
నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా
నాకొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా
నా ధ్యాస నీవయ్యా నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా

Your favourites

  • No Favourites found!