Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి Telugu Christian Song Lyrics

గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి Lyrics

గాలి సముద్రపు అలలకు నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)
ఆదరించెనూ నీ వాక్యము
లేవనెత్తెనూ నీ హస్తము (2) ||గాలి||
శ్రమలలో నాకు తోడుంటివి
మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)
ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)
నీ కృపలో నను బ్రోచితివి (2) ||గాలి||
వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)
చూపితివి నీ మహిమన్‌ (2)
కొనియాడెదను ప్రభుయేసుని (2) ||గాలి||

Your favourites

  • No Favourites found!