గానముఁ జేయుఁడు సుకీర్తనను యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను ||గానము||
1.
తన్నామము నుతించి యతని రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ
జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను
జాటండి ||గానము||
2.
ఘనతయు మహత్మ్యమును దద్ఘనని యెదుటనుండు ఘనబలమును
వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము||
3.
పరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన పరులై యుండండి
ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానము||
4.
పరిపాలించుచున్నాఁడనుచు తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ
స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము
విమర్శించు ||గానము||
5.
ఏమనిన నా మహాత్ముండు వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు
భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానము||
6.
జనులారా యా యెహోవాకు మహిమను బలమును సమర్పణము
జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున
వసియింపండి ||గానము||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
గానముఁ జేయుఁడు సుకీర్తనను యెహోవాను గూరిచి Lyrics
Your favourites
- No Favourites found!
