Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను Telugu Christian Song Lyrics

గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను Lyrics

గాయములన్ గాయములన్ - నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు
1. సురూపమైన సొగసైన లేదు - దుఃఖ భరితుడాయెను
వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ - వీక్షించి త్రిప్పిరి ముఖముల్
2. మా రోగములను మా దుఃఖములను - మనకై తానే భరియించె
మొత్తబడెను బాధించబడెను - యెంతో శ్రమనొందె మనకై
3. మా అతిక్రమ క్రియలను బట్టి - మరి నలుగగొట్టబడెను
తాను పొందిన దెబ్బలద్వారా - స్వస్థత కలిగె మనకు
4. పాపంబు కపటంబు లేదు ప్రభునందు - మౌనము వహియించె మనకై
ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించె - ప్రభువే ఘోర సిలువపై
5. క్రీస్తు ప్రేమను మరువజాలము - యెంతో ప్రేమించె మనల
సిలువపై మేము గమనించ మాకు - విలువైన విడుదల గలిగె


Your favourites

  • No Favourites found!