Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గడచిన కాలము కృపలో మమ్ము Telugu Christian Song Lyrics

గడచిన కాలము కృపలో మమ్ము Lyrics

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)        ||గడచిన||

కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)       ||గడచిన||

లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2)        ||గడచిన||

Your favourites

  • No Favourites found!