Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గడిచిన కాలమంతా  నను నడిపిన Telugu Christian Song Lyrics

గడిచిన కాలమంతా నను నడిపిన Lyrics

గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా
నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2)
మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును (2) ||గడిచిన||
ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు
శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు (2)
నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి
చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి (2) ||మరో యేడు||
నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా (2)
నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి
నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి (2) ||మరో యేడు||

Your favourites

  • No Favourites found!