Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను Telugu Christian Song Lyrics

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను Lyrics

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్న
ప్రాణప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని…
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2)
ఉల్లసించుచున్నది…           ||గగనము||

1. నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2)
పవిత్రురాలైన కన్యకగా
నీ యెదుట నేను నిలిచెదను (2)
నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2)         
                                                       ||గగనము||
2. నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2)
కళంకములేని వధువునై
నిరీక్షణతో నిన్ను చేరెదను (2)
యుగయుగాలు నీతో ఏలెదను (2)         
                                                    ||గగనము||
3. నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో (2)
సీయోనులో నీతో నేనుందును (2)         
                                                  ||గగనము||

Your favourites

  • No Favourites found!