Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గీతం గీతం జయ జయ గీతం Telugu Christian Song Lyrics

గీతం గీతం జయ జయ గీతం Lyrics

గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము
అను యేసు రాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము
1. చూడు సమాధిని మూసినరాయి - దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా
దైవసుతుని ముందు
2. వలదు వలదు ఏడువ వలదు - వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి
3. అన్న, కయప, వారల సభయు - అదరుచు పరుగిడిరి
ఇంక దూతగణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి
4. గుమ్మలు తెరిచి చక్కగ నడువుడు - జయ వీరుడు రాగా
మీ మేళ తాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి


Your favourites

  • No Favourites found!